
‘విజయ’దశమి
● జిల్లా కేంద్రంలో అంబరాన్నంటిన
సంబరాలు
● భక్తిశ్రద్ధలతో శమీ పూజలు
కందనూలు: చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నిర్వహించే దసరా సంబరాలను గురువారం జిల్లావ్యాప్తంగా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ప్రసిద్ధ ఆలయాను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి జమ్మిచెట్టు వద్దకు ఊరేగింపుగా చేరుకొని శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి ఆకును ఒకరినొకరు పంచుకొని ఎమ్మెల్యే పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో దసరా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మినీ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే దంపతులు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, సంగీతం, సంప్రదాయ కళలు ప్రజలను అలరించాయి. చెరువు కట్టపై ఏర్పాటు చేసిన లైటింగ్ అందరినీ ఆకట్టుకుంది. ట్యాంక్‌బండ్ వద్దకు మహిళలు, యువత, చిన్నారులు పెద్ద ఎత్తున చేరుకొని బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు.

‘విజయ’దశమి