
అమ్మవారి విగ్రహ నిమజ్జనం
దోమలపెంట: దేవీ శరన్నవరాత్రులు పురస్కరించుకుని భూగర్భ విద్యుత్ కేంద్రంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని శ్రీశైలం ఆనకట్ట దిగువున కృష్ణానదిలో గురువారం కేంద్రం ఇంజినీర్లు, ఉద్యోగులు నిమజ్జనం చేశారు. అంతకుముందు సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి కృష్ణానది వరకు ఊరేగింపు నిర్వహించారు.
హక్కు పత్రాలు
ఇచ్చి ఆదుకోవాలి
మన్ననూర్: దశాబ్దాలుగా ముత్తాతలు, తాతల కాలం నుంచి ఇప్పటికీ సాగు చేసుకుంటున్న వ్యవసాయ పొలాలకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ హక్కు పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని చెంచు సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు దాసరి నాగయ్య పాలకులు, అధికారులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మన్ననూర్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. 50, 60 ఏళ్ల కాలంగా తమ పూర్వీకులు (చెంచులు) కండ్లకుంట, రాసుమళ్లబావి వద్ద వ్యవసాయ భూమిలేని నిరుపేద చెంచులు సాగు చేసుకుంటునప్పటికీ ఆ భూములకు హక్కు పత్రాలు దక్కలేదన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కొంతకాలంగా అర్హులైన లబ్ధిదారులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఇస్తున్నప్పటికీ, చట్టాలు అంటే తెలియని కొందరు ఆదివాసీ చెంచులు హక్కుపత్రాలు ఇచ్చే దిశగా ఎన్నడూ ప్రయత్నం చేయలేదన్నారు. చెంచుల సాగు భూములను అటవీ సరిహద్దు ప్రాంతం అంటూ తప్పుడు సర్వేలతో అటవీశాఖ అధికారులు చెంచులపై దౌర్జన్యాలకు పాల్పడటం సరైంది కాదన్నారు. ఇప్పటికై నా అమాయకులైన ఆదివాసీ చెంచులపై సానుకూలంగా స్పందించి నిజమైన అర్హులకు హక్కు పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

అమ్మవారి విగ్రహ నిమజ్జనం