
కేఎల్‌ఐ కాల్వలకు గండి
వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వలకు గండ్ల పరంపర కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజామున పోతేపల్లి సమీపంలో నీటి ప్రవాహం పెరగడంతో కాల్వ గట్టు తెగిపోయింది. అలాగే సాయంత్రం మండల కేంద్రం సమీపంలో మరో గండి పడటతో సుమారు 10 ఎకరాల వరి పంట నీట మునిగింది. కాల్వలు తెగి సాగునీరు వ్యవసాయ పొలాలను ముంచెత్తుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు నీటమునిగి తమకు నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కేఎల్‌ఐ డీఈఈ దేవన్న సిబ్బందితో వెళ్లి పోతేపల్లి సమీపంలో మట్టి సంచులతో కాల్వ గండిని పూడ్చివేశారు.
నీట మునుగుతున్న వరిపంట

కేఎల్‌ఐ కాల్వలకు గండి