
ఫుట్‌బాల్ చాంపియన్‌గా వనపర్తి
● రన్నరప్‌గా నిలిచిన కరీంనగర్
● సెమీస్‌లో పోరాడి ఓడిన మహబూబ్‌నగర్
● ట్రోఫీలు అందజేసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
– మహబూబ్‌నగర్ క్రీడలు
విప్లవ ఉద్యమాలకు దిక్సూచి భగత్‌సింగ్
నాగర్‌కర్నూల్ రూరల్: దేశంలోని యువతకు భగత్‌సింగ్ ఒక దిక్సూచి అని, భగత్‌సింగ్ స్ఫూర్తితో విద్య కాషాయీకరణ, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తీరును యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. స్వాతంత్ర ఆకాంక్షను నిలువెల్లా నింపుకొని ఆంగ్లేయులపై ఎగిసిపడి యువతను స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వాములు చేసిన వీరుడు భగత్‌సింగ్ అని కొనియాడారు. సమాజ మార్పు కోసం యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శులు ప్రేమ్‌కుమార్, శ్రీనివాస్, నరేష్, ఆంజనేయులు, శివకృష్ణ, శివశంకర్, రామస్వామి, మన్విత్, అఖిల్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.