
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
నాగర్‌కర్నూల్ క్రైం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు ముఖ్య అతిథి గా హాజరైన జిల్లా జడ్జి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భాద్రపద మాసం అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పూజలు చేస్తారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా చేసుకుంటున్నామని పేర్కొన్నారు. వివిధ కాలానుగుణ పువ్వులతో బతుకమ్మ పేర్చుతారని, వాటిలో ఎక్కువ భాగం ఔషధ విలువలతో ఆలయ గోపురం ఆకారంలో ఉంటాయన్నా రు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ నసీం సుల్తానా, సీనియర్ సివిల్ జడ్జి వెంకట్‌రాం, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శృతిదూత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిధి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంతారావు, బార్ సెక్రటరీ ఎం మధుసూదన్‌రావు పాల్గొన్నారు.