
సాంకేతిక విజ్ఞానం అందిపుచ్చుకోవాలి
కల్వకుర్తి టౌన్/మన్ననూర్: ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే సాంకేతికను అందిపుచ్చుకుంటే భవిష్యత్‌లో ఉన్నతంగా రాణించేందుకు వీలుంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సూచించారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్‌నగర్ రోడ్డులో ఉన్న ఐటీఐ కళాశాల ప్రాంగణంలో, మన్ననూర్‌లోని ఆర్‌ఐటీఐ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీసీ (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్)ను వారు వేరువేరుగా ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానం లేక చాలామంది ఉద్యోగాల్లో వెనకబడుతున్నారని, వారిలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు ముఖ్యమంత్రి ఏటీసీలను తీసుకొచ్చారన్నారు. కార్యక్రమంలో పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్, కల్వకుర్తి ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జయమ్మ, మన్ననూర్ ఐటీఐ ప్రిన్సిపాల్ లక్ష్మణస్వామి, టీజీ ఐఐసీ డీఈ జ్యోతి, నాయకులు పోషం గణేష్, బుచ్చయ్య, హరినారాయణ, రహీం తదితరులు పాల్గొన్నారు.

సాంకేతిక విజ్ఞానం అందిపుచ్చుకోవాలి