
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి
● ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
నాగర్‌కర్నూల్ క్రైం: తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎనలేని కృషి చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయ న చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ నాన్ ముల్కీ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన ధీశాలి అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కోసం నాలుగు దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉండి పోరాడారన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ జగన్, ఏఓ కృష్ణయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.