
అనుమానితుల కదలికలపై నిఘా : ఎస్పీ
అచ్చంపేట రూరల్: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి భరోసా కల్పించడంతో పాటు అనుమానితుల కదలికలపై నిఘా పెట్టాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశించారు. గురువారం అచ్చంపేట డీఎస్పీ, సీఐ కార్యాలయాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ, సత్సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. నేరాల అదుపునకు గస్తీని ముమ్మరం చేయాలని ఆదేశించారు. కేసుల నమోదు, రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. డయల్ 100 కాల్స్‌కి వెంటనే స్పందించి.. ఘటనా స్థలానికి చేరుకోవాలన్నారు. శ్రీశైలం–హైదరాబాద్ హైవేలో ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విలేజ్ పోలీసింగ్ ఆఫీసర్లు తమ గ్రామాలను తరచూ సందర్శించాలని సూచించారు. అంతకుముందు పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఎస్పీ వెంట డీఎస్పీ పల్లె శ్రీనివాసులు, సీఐ నాగరాజు, ఎస్‌ఐలు విజయభాస్కర్, ఇందిర, పవన్‌కుమార్, వెంకట్‌రెడ్డి ఉన్నారు.