
సమాజ సేవలో పోలీస్
అనాథల కోసం కై ండ్‌నెస్ వాల్ ఏర్పాటు
● జిల్లాలోని 22 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఏర్పాటుకు కసరత్తు
● ప్రజల నుంచి విశేష స్పందన
సమాజంలో ప్రతి వ్యక్తి పేదలకు సహాయం చేసేందుకు ముందుకు రావాలి. పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కై ండ్‌నెస్ వాల్ కార్యక్రమం ద్వారా చాలా మందికి సేవలు అందిస్తున్నాం. ప్రజలు తమకు అవసరం లేని వస్తువులను స్వచ్ఛందంగా అందించాలి. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కై ండ్ నెస్‌వాల్‌కు మంచి స్పందన వస్తుంది. మరిన్ని చోట్ల ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం.
– గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎస్పీ
నాగర్‌కర్నూల్ క్రైం: సమాజ సేవలో జిల్లా పోలీసులు ముందు వరుసలో నిలుస్తున్నారు. ఒకప్పుడు పోలీసులను చూస్తేనే ప్రజలు భయపడేవారు. కానీ నేడు ఫ్రెండ్లీ పోలీస్ పేరిట పోలీసులు ప్రజలకు చేరువ అవ్వడంతో పాటు ఎప్పటికప్పుడు బాధితుల సమస్యలు పరిష్కరిస్తుండటంతో పోలీసులకు సమాజంలో ఆదరణ పెరుగుతోంది. ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ వినూత్న ఆలోచనలకు జిల్లా ప్రజలు నీరాజనం పడుతున్నారు. అనాథలతో పాటు పేద, మధ్య తరగతి ప్రజలకు తమ వంతు సహకారం అందించేందుకు జిల్లా కేంద్రంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో కై ండ్‌నెస్ వాల్ ఏర్పాటు చేసి బట్టలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, వంట సామగ్రిని ఉచితంగా అందిస్తున్నారు.
విశేష స్పందన
అనాథల కోసం ఏర్పాటు చేసిన కై ండ్‌నెస్ వాల్‌కు విశేష స్పందన లభిస్తుంది. చాలా మంది తమ వద్ద నిరుపయోగంగా ఉన్న పాత బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సామగ్రిని తీసుకొచ్చి అక్కడ అందిస్తున్నారు. అదేవిధంగా తమకు కావాల్సిన వస్తువులను తీసుకెళ్తున్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలోని 22 పోలీస్‌స్టేషన్ల పరిధిలో కై ండ్‌నెస్ వాల్ ఏర్పాటు చేయాలని కసరత్తు చేస్తున్నట్లు పోలీసువర్గాలు వెల్లడిస్తున్నారు.
ఎన్నో సేవాకార్యక్రమాలు
ఎస్పీగా గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా కేంద్రంతో పాటు కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది సేవా కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్నారు. వరదల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. యువత చెడు మార్గాలను ఎంచుకోకుండా డ్రగ్స్‌పై కళాజాత బృందంతో అవగాహన కల్పించడంతో పాటు డ్రగ్స్ నిర్మూలన కోసం వీడియో పాటలను రూపొందించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

సమాజ సేవలో పోలీస్

సమాజ సేవలో పోలీస్

సమాజ సేవలో పోలీస్