
వచ్చే సీజన్ నాటికి..
లింక్ కెనాల్ కోసం దాదాపు 300 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇందుకోసం గ్రామాల వారీగా రైతులతో గతంలోనే మాట్లాడాం. ఇటీవల భూసేకరణ అంశాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ప్రస్తావించి.. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకు 5 కి.మీ., మేరకు కాల్వ తవ్వకం పూర్తయింది. చాలాచోట్ల అక్విడెక్టు పనులు కూడా పూర్తి చేశారు. భూ సేకరణపై రెవెన్యూ అధికారులు దృష్టిసారించారు. వచ్చే సీజన్ నాటికి కెనాల్ పనులు పూర్తికావొచ్చని భావిస్తున్నాం.
– శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటిపారుదల శాఖ
●