
నెలాఖరులోగా భూ సేకరణ పూర్తి చేస్తాం
నాగర్‌కర్నూల్: జాతీయ రహదారులకు అవసరమైన భూ సేకరణను ఈనెలాఖరులోగా పూర్తి చేస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు అవసరమైన స్థల సేకరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు. కాగా.. జిల్లా నుంచి వీసీలో కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ భూములు కోల్పోయిన రైతు లకు వెంటనే పరిహారం అందించేందుకు చర్య లు తీసుకుంటామన్నారు. సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి భూసేకరణలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషిచేయాలన్నారు. సమావేశంలో జాతీయ రహదారుల ఈఈ సురేందర్, ఆర్డీఓలు సురేష్, భన్సీలాల్, జనార్దన్‌రెడ్డి, డీఈ రమేష్‌బాబు పాల్గొన్నారు.