
పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
అచ్చంపేట రూరల్: సమస్యల సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. సోమవారం అచ్చంపేటలోని టీఎన్‌జీఓ భవనంలో రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి అధ్యక్షతన డివిజన్ స్థాయి నల్లమల నగర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ నల్లమల పాదయాత్రలో మేనిఫెస్టోలో ప్రకటించిన పాతపెన్షన్‌ను ప్రభుత్వం పునరుద్ధరించాలన్నారు. ఇప్పటికే సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సాధించుకున్నామని, ఇక సర్వీస్ పెన్షన్ కోసం ఉద్యోగులు ఐక్యంగా పోరాడాలన్నారు. అనంతరం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలను ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శిగా గోపాల్, జిల్లా కార్యదర్శిగా శ్రీనివాస్‌గౌడ్, అచ్చంపేట డివిజన్ నూతన గౌరవాధ్యక్షుడిగా మారేడి కుమార్, అధ్యక్షుడిగా తేజనాయక్, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు, కోశాధికారిగా సూర్య, ఉపాధ్యక్షుడిగా చెన్నకేశవులు, అచ్చంపేట మండల అధ్యక్షుడిగా హనుమానాయక్, లింగాల మండల అధ్యక్ష, కార్యదర్శులుగా రాంలాల్‌నాయక్, వెంకటేశ్వర్లు, ఉప్పునుంతల అధ్యక్షుడిగా భూపతికుమార్, బల్మూర్ అధ్యక్షుడిగా లోకేష్‌ను ఎన్నుకున్నారు.