
కుండపోత వర్షం
బల్మూర్/తాడూరు/తిమ్మాజిపేట/అమ్రాబాద్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. బల్మూర్ మండలంలో అత్యధికంగా 66.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షానికి చెరువులు నిండి అలుగులు పారాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాల్లో సాగుచేసిన పత్తి, వరిపంట నీటమునిగింది. చెట్లకొమ్మలు విరిగి విద్యుత్ వైర్లపై పడటంతో బల్మూర్, గోదల్ తదితర గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాజ్‌వేలు, లో లెవల్ వంతెనల వద్ద వరద ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అదే విధంగా తాడూరు మండలంలో 20.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. గంటన్నర పాటు భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. తిమ్మాజిపేట మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఇళ్ల మధ్యన వర్షపునీరు వచ్చి చేరడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి సమీపంలోని గుండం జలపాతం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. కొండలపై నుంచి జాలువారుతున్న నీటిలో పర్యాటకులు సందడి చేశారు.

కుండపోత వర్షం

కుండపోత వర్షం

కుండపోత వర్షం