
హోంగార్డులు ప్రజల రక్షణ కోసం పనిచేయాలి
నాగర్‌కర్నూల్ క్రైం: హోంగార్డులు ప్రజల రక్షణ కోసం పనిచేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని 22 పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న 117 మందికి ఉలన్‌జెర్సీలు, రెయిన్ కోట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వరదల సమయంలో హోంగార్డులు నిబద్ధతతో పనిచేశారని, వారి సేవలు మరువలేనివని కొనియాడారు. హోంగార్డులకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో హోంగార్డు ఇన్‌చార్జి ఆర్‌ఐ రాఘవరావు, హోంగార్డులు పాల్గొన్నారు.