
పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం
జిల్లావ్యాప్తంగా 16 సీసీఐ కేంద్రాల ఏర్పాటు
ఆధార్ అనుసంధానం
తప్పనిసరి
జిల్లాలో అక్టోబర్ మొదటి వారంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే అవకాశం ఉంది. పత్తి కొనుగోళ్లు, చెల్లింపులు, ఇతరత్రా విషయాల్లో పారదర్శకత కోసం రైతుల బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం ఉండాలనే నిబంధన పెట్టారు. పత్తి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే సయంలో ఆధార్‌కార్డులతో పాటు పాస్‌బుక్కు కూడా వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. రైతులు తమ వివరాలను కిసాన్ యాప్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. ఇందులో రైతుల వివరాలతో పాటు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశారనే సమాచారాన్ని మొత్తం నమోదు చేయాల్సి ఉంటుంది.
నాగర్‌కర్నూల్: ప్రభుత్వం తరుఫున పత్తి కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 16 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్‌లోనే పత్తి ధర అధికంగా ఉండడం, తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయడంతో గతేడాది పెద్దగా రైతులు కొనుగోలు కేంద్రాలపై ఆసక్తి చూపలేదు. చాలా చోట్ల తేమ శాతం సాకుగా చూపి మోసం చేసిన ఘటనలు కూడా అక్కడక్కడ జరగడం రైతులను కొంత నష్టపరిచింది.
●
అక్టోబర్ మొదటి వారంలో..
జిల్లాలో 16 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. కొనుగోలు కేంద్రాలకు పత్తి తీసుకొచ్చే ప్రతి రైతు బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం అయి ఉండాలి. అక్టోబర్ మొదటి వారంలో కొనుగోళ్లు ప్రారంభిస్తాం. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. రైతులు దళారులను నమ్మకుండా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలి.
– సిరంజిత్ సింగ్, జిల్లా మార్కెటింగ్ అధికారి
అక్టోబర్ మొదటి వారంలోప్రారంభించే అవకాశం
కొనసాగుతున్న టెండర్ ప్రక్రియ
33 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా
మద్దతు ధర రూ.8,110

పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం