
న్యాయవాదులకు రక్షణ కల్పించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: న్యాయవాదులకు రక్షణ కల్పించాలని నాగర్‌కర్నూల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంతరావు డిమాండ్ చేశారు. ఈనెల 17న అర్ధరాత్రి బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌లో న్యాయవాది ఇంటిపై నిప్పుపెట్టి హత్యాయత్నానికి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. న్యాయవాదులపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ మధుసూదన్‌రావు, న్యాయవాదులు రాం లక్ష్మణ్, శ్యాంప్రసాద్ రావు పాల్గొన్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు గ్రహణం
● 28న అచ్చంపేటలో కేటీఆర్ పర్యటన
అచ్చంపేట రూరల్: తమది రైతు ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం అచ్చంపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా, అచ్చంపేట అభివృద్ధికి ఎలాంటి ప్రతిపాదనలు రూపొందించడం లేదని మండిపడ్డారు. అచ్చంపేట ప్రాంతంలోని ఉమామహేశ్వర, చెన్నకేశవ రిజర్వాయర్‌పై దృష్టి సారించడం లేదన్నారు. 2023లో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అనుమతులిచ్చినా ఇప్పటికీ ఎందుకు పనులు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే రాష్ట్రానికి సాగునీరు తక్కువగా వస్తాయన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తైనా కాల్వ పనులు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. అంతకుముందు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... గత బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు కనీసం యూరియా అందించలేని దుస్థితిలో ఉందని అసహనం వ్యక్తం చేశారురు. యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లలో పెట్టాల్సిన పరిస్థితిని మళ్లీ తెచ్చారని ఎద్దేవా చేశారు. ఈ నెల 28న అచ్చంపేటలో నిర్వహించే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ సభను పార్టీ శేణ్రులు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం సభాస్థలిని పరిశీలించి, ఏర్పాట్లు చూశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, నాయకులు నర్సింహాగౌడ్, తులసీరాం, అంతటి శివ, రమేష్‌రావు, కుత్బోద్దీన్ పాల్గొన్నారు.

న్యాయవాదులకు రక్షణ కల్పించాలి