
క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలు
● జిల్లాలో కలకలం రేపుతున్న వరుస ఘటనలు
● మానవత్వం మరిచి కిరాతకంగా హతమారుస్తున్న వైనం
● బాధిత, నిందితుడి కుటుంబాలు చిన్నాభిన్నం
స్వచ్ఛందంగా
మార్పు రావాలి
క్షణికావేశంలో జరుగుతున్న ఆత్మహత్యలు, హత్యలపై ప్రజల్లో స్వచ్ఛందంగా మార్పు రావాలి. తరుచూ నేరాలకు పాల్పడుతూ హత్యలు చేస్తున్న వారిపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించి చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. ఆత్మహత్యలకు పాల్పడటం, హత్యలకు పాల్పడటం వల్ల కుటుంబాలు చిన్నాభి న్నం అవుతాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు సరైనవి కావు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిరంతరం గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థల్లో అవగాహన కల్పిస్తాం.
– గైక్వాడ్ వైభవ్‌రఘునాథ్,
ఎస్పీ, నాగర్‌కర్నూల్
నాగర్‌కర్నూల్ క్రైం: క్షణికావేశంలో నియంత్రణ కోల్పోయి కొందరు చేస్తున్న హత్యలు, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో బాధిత, నిందితుడి కుటుంబ సభ్యులు సైతం పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలో ఇటీవల జరుగుతున్న వరుస హత్యలతో పాటు ఆత్మహత్యలు భయాందోళన కలిగిస్తున్నాయి. మానవ సంబంధాలను మరిచి కిరాతకంగా హత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే బంధాల విలువతో పాటు చెడువ్యనసాల వల్ల కలిగే అనర్థాలు, జీవితంలో అన్నింటికి ఆత్మహత్యలే పరిష్కారం కాదనే విషయాలపై అవగాహన కల్పిస్తే కొంతైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబకలహాలతో తన ముగ్గురు చిన్నారులను కిరాతకంగా హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
వరుస ఘటనలతో భయాందోళనలు
జిల్లాలో ఇటీవల జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు క్షణికావేశంలో జరుగుతున్నవే ఎక్కువగా ఉన్నాయి. జీవితాంతం తోడు నీడగా ఉండాల్సిన భార్యాభర్తలు అనుమానంతో కొందరు, ఆస్తికోసం మరికొందరు, మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో అత్యంత కిరాతకంగా హత్యలకు పాల్పడుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఇటీవల జరిగిన ఘటనలు
● ఆగస్టు 28న బల్మూరు మండలంలోని మైలారంలో ఓ వ్యక్తిని హత్య చేసి మామిడి తోటలో పూడ్చడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి శవాన్ని వెలికితీశారు.
● ఈ నెల 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి కుటుంబ కలహాలతో తన ముగ్గురు చిన్నారులను ఉప్పునుంతల, కల్వకుర్తి మండలాల్లో కిరాతకంగా చంపి తాను వెల్దండ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు.
● ఈ నెల 4న కల్వకుర్తి పట్టణంలో ఓ వ్యక్తి తన తండ్రిని కారులో కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడి తల, మొండం వేరుచేసి దుందుభీ నదిలో పారవేశాడు.
● ఈ నెల 11న జిల్లాకేంద్రంలోని ఓ యువకుడు కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
● ఈ నెల12న జిల్లా కేంద్రంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
● ఈ నెల 12న నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్లలో తల్లిని కన్నకొడుకు గొంతు నులిమి చంపిన ఘటన చోటుచేసుకుంది.
ఏడాది హత్యలు ఆత్మహత్యలు
2023 33 191
2024 39 182
2025లో ఇప్పటివరకు18 91
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి
ప్రస్తుతం చాలా మంది మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలతో పాటు హత్యకు పాల్పడుతున్నారు. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు వైద్యులు సంప్రదించి సరైన వైద్యం పొందినపుడే సరైన నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించడంతో పాటు వారి ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. భార్యాభర్తలు, కుటుంబంలో ఏర్పడే కలహాలను సామరస్యంగా పరిష్కరించుకుంటే అందరూ సంతోషంగా ఉండొచ్చు. మానసిక ఒత్తిడిలో ఉన్న వారు జనరల్ ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవాలి.
–డా. అంబుజ, అసిస్టెంట్ ప్రొఫెసర్, సైక్రియాటిస్టు, జనరల్ ఆస్పత్రి
మూడేళ్ల కాలంలో..

క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలు

క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలు

క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలు

క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలు

క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలు