
పాత నేరస్తుల కదలికలపై నిఘా
అచ్చంపేట రూరల్: పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని డీఎస్పీ పల్లె శ్రీనివాసులు స్థానిక పోలీసు అధికారులకు సూచించారు. గురువారం అచ్చంపేట పోలీసు సర్కిల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ కోసం నిరంతరం గస్తీ నిర్వహించాలని సూచించారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టిసారించి.. బాధితులకు భరోసానివ్వాలని తెలిపారు. వృత్తిపరమైన సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. డీఎస్పీ వెంట సీఐ ఏశమళ్ల నాగరాజు, ఎస్‌ఐ విజయ్‌భాస్కర్ ఉన్నారు.