
నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు
నాగర్‌కర్నూల్ క్రైం: హోటళ్లు, దాబాల్లో నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నీలిమ హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని నెల్లికొండ చౌరస్తాలో ఉన్న దాబాల్లో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దాబాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. హోటళ్లు, దాబాలతో పాటు బేకరీల్లో నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఆహార పదార్థాలను తయారుచేసేందుకు నాణ్యతతో కూడిన వస్తువులు వినియోగించాలన్నారు. నెల్లికొండ చౌరస్తా వద్ద ఉన్న దాబాల్లో అపరిశుభ్రవాతావరణం ఉండటంతో నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.