
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
కందనూలు: ప్రతి ఒక్కరూ పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని.. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి అన్నారు. పోషణ్ మాసోత్సవంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని వాత్సల్య మందిరంలో అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడబ్ల్యూఓ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందించాలని సూచించారు. పౌష్టికాహారం పంపిణీలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. అదే విధంగా పౌష్టికాహారంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.