
బీఆర్‌ఎస్ అంటేనే బోగస్
ములుగు: బీఆర్‌ఎస్ అంటేనే బోగస్ రాష్ట్ర సమితి అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి అప్పుల తెలంగాణగా మార్చాడని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కాలంలోనే ఇచ్చిన హామీలను నేరవేర్చి ప్రజాప్రభుత్వంగా కొనసాగుతుందన్నారు. అభివృద్ధిని ఓర్వలేని బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఇస్సార్ ఖాన్, మారం సుమన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, నాయకులు నల్లెల్ల భరత్‌కుమార్, ఓరుగంటి అనిల్, నాగమణి, శంకరాచారి, రఘు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
బానోతు రవిచందర్