ములుగు రూరల్: మల్లంపల్లి మండల పరిధిలోని రాంచంద్రాపురంలో నూతనంగా నిర్మించిన దుర్గామాత ఆలయాన్ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసి ప్రారంభోత్సవానికి సైతం హాజరు కావడం ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు హట్కర్ స్వామి, సాంబయ్య, రాజిరెడ్డి, భూక్య రాజునాయక్, ప్రతాప్‌రెడ్డి, అమృతమ్మ తదితరులు పాల్గొన్నారు.
హుండీ ఆదాయం రూ.71,902
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని శ్రీభక్తాంజనేయస్వామి దేవాలయ హుండీ ఆదాయం రూ.71,902 వచ్చినట్లు ఆలయ ఈఓ మహేష్ తెలిపారు. సోమవారం ఎండోమెంట్ రెవెన్యూ డివిజన్ ఇన్‌స్పెక్టర్ నందనం కవిత ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రాధాకృష్ణ, మురళీకృష్ణ, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.

దుర్గామాత ఆలయం ప్రారంభం