
వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి
ములుగు రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు సోమవారం ములుగు మండల పరిధిలోని జాకారం, మల్లంపల్లి మండల కేంద్రంలోని ఆయూష్ ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో 100 శాతం ప్రసవాలు జరిగే విధంగా చూడాలన్నారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు, టీబీ నియంత్రణ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు శ్రవన్‌కుమార్, రాజన్న, మంజుల, సుజాత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు