
ఈ–కేవైసీ త్వరితగతిన పూర్తిచేయాలి
● డీఆర్‌డీఓ శ్రీనివాసరావు
కన్నాయిగూడెం: ఉపాధి కూలీలకు ఆధార్ ఈ–కేవైసీ త్వరితగతిన పూర్తిచేయాలని డీఆర్‌డీఓ శ్రీనివాస రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మండల పరిధిలోని బుట్టాయిగూడెం, ఏటూరు, చింతగూడెంలో కొనసాగుతున్న ఈ కేవైసీ కార్యక్రమాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. వాటిల్లో వచ్చే సాంకేతిక సమస్యలు వీఏ, టీఏలకు వివరించారు. ఈ సందర్భంగా పీడీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతీ కూలీకి ఫేస్ స్క్రీనింగ్ చేయించాలని సూచించారు. దీంతో ఉపాధి పనుల్లో అవకతవకలు జరగకుండా కట్టడి చేయవచ్చని తెలిపారు. ఉపాధి పనికి వెళ్తే హాజరు నమోదు అవుతుందని వెల్లడించారు. లేని పక్షంలో హాజరు నమోదు కాదని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీఓ కృపాకర్, కన్నాయిగూడెం ఏపీఓ సురేష్, టీఏ కోటేశ్, ఫీల్డ్ అసిస్టెంట్ సునార్కని నారాయణ తదితరులు పాల్గొన్నారు.