
ప్రభుత్వం చొరవ చూపాలి
మండలంపై సుప్రీంకోర్టులో ఉన్న ఏజెన్సీ, నాన్‌ఏజెన్సీ పంచాయతీని త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. 14 ఏళ్లుగా ప్రజా సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారు. విద్య, వైద్యంతోపాటు అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మండల అభివృద్ధి కుంటుపడింది. త్వరగా సమస్య పరిష్కారమై ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలకు మేలుజరుగుతుంది.
– తోట రమేష్,
ఎఫ్‌ఎస్‌సీఎస్ వైస్ చైర్మన్, మంగపేట
ప్రజలకు అన్యాయం జరుగుతోంది..
ప్రత్యేకాధికారుల పాలనలో అధికారులపై పర్యవేక్షణ లేకపోవడంతో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి లేకుండాపోయింది. అన్నివర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోంది. ప్రశ్నించే ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో ప్రత్యేకధికారులు తమను అడిగేవారు లేరనే ధీమాతో నిర్లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వివిధ శాఖల అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
– కబ్బాక శ్రావణ్‌కుమార్,
తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ప్రభుత్వం చొరవ చూపాలి