
‘వందుర్‌గూడలో ఎన్నికల బహిష్కరణకు తీర్మానం’
దండేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరణకు మండలంలోని వదురుగూడ గ్రామస్తులు తీర్మానించారు. పంచాయతీ ఎన్నికల బహిష్కరణపై ఆదివా రం అర్ధరాత్రి గ్రామస్తులతో గ్రామ పటేల్ కోవ దౌలత్‌రావు మొకాశి సమావేశం అయ్యారు. నెల్కివెంకటాపూర్ గ్రామ పంచాయతీ నుంచి వందురుగూడను ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారని, దీనిని వ్యతిరేకిస్తూ ఆందోళనలు, నిరసనలు చేపట్టామని తెలిపారు. పంచాయతీ ఏర్పాటు విషయమై పునఃపరిశీలన చేయాలని కోర్టు ఆదేశించినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. కోర్టు ఆదేశాలను అమలు చేయాలని, వందుర్‌గూడను నెల్కివెంకటాపూర్‌లో కొనసాగించాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో ఎన్నికలను బహిష్కరిస్తామని తీర్మాన పత్రాలను కలెక్టర్, జెడ్పీసీఈవోకు సోమవారం అందజేసినట్లు తెలిపా రు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కోవ ధర్మరావు, కోవ మారుతి, ఆడ చందు, కుంరం సోనేరావు, బాపురావు, కుడ్మెత వినోద్, పంద్రం హేమంతు, సేడ్మకి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.