లక్సెట్టిపేట: గోదావరిఖని బార్ అసోసియేషన్ న్యాయవాది రమేశ్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ మండల కేంద్రంలోని మున్సిఫ్ మేజిస్ట్రేట్ కో ర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సోమవారం విధులు బహిష్కరించారు. న్యాయవా దులపై తరచూ దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. న్యాయవాదుల కోసం ప్రత్యేక రక్షణ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న, ఉపాధ్యక్షుడు నళినికాంత్, సంయుక్త కార్యదర్శి సత్యగౌడ్, న్యాయవాదులు ప్రకాశం, సదాశివ, సురేందర్, శ్రీధర్, గోవిందరావు, కిరణ్‌కుమార్, రవీందర్, షఫీక్, పద్మ పాల్గొన్నారు.