
దళారులను ఆశ్రయించి మోసపోవద్దు
మంచిర్యాలఅగ్రికల్చర్: పత్తి రైతులు దళారులును నమ్మి మోసపోవద్దని, సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, మంచిర్యాల, కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా మార్కెటింగ్ అధికారులు షహబుద్దీన్, అశ్వక్ అహ్మద్‌తో కలిసి కపాస్ కిసాన్ యాప్ వినియోగం, రైతుల వివరాల నమోదు, పత్తి విక్రయం అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పత్తి విక్రయానికి యాప్‌లో వివరాలు నమోదు చేసునేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఆధార్ కార్డులో వేలిముద్ర, కంటి స్కాన్, మొబైల్ నంబర్ అనుసంధానం చేసుకోవా లని తెలిపారు. ఆధార్‌కు అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాలోనే నగదు చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. పత్తికి క్వింటాల్‌కు మద్దతు ధర రూ.8,110 నుంచి రూ.8,010 నిర్ణయించినట్లు తెలి పారు. అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.