
‘స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకండి’
బెల్లంపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి బీజేపీ శ్రేణులు సిద్ధ కావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. సోమవారం బెల్లంపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యక్రమాలు నిర్వహిస్తూనే నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీకి ఆశావహుల జాబితా సేకరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కొయ్యల ఏమాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు దుర్గం అశోక్, వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు రాచర్ల సంతోష్‌కుమార్, మహేందర్‌గౌడ్, సీనియర్ నాయకులు మున్నారాజా సిసోడియా, పులగం తిరుపతి, మండల పార్టీ అధ్యక్షుడు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.