
చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● సీనియర్ సివిల్ జడ్జి శాలిని
మహబూబాబాద్ రూరల్ : చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లి న్యాయ చైతన్యం కలిగించాలని సీనియర్ సివిల్ జడ్జి శాలిని అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో 50మంది పారా లీగల్ వలంటీర్లకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ తరగతులు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి శాలిని మాట్లాడుతూ.. చట్టాలపై అవగాహన లేని ప్రతీ వ్యక్తి కూడా న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించే విధంగా పారా లీగల్ వలంటీర్లు ప్రోత్సహించాలని, తద్వారా ప్రజల్లో న్యాయ చైతన్యం పెరుగుతుందని సూచించారు. సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ నాగవాణి, ప్రభుత్వ న్యాయవాది తోర్నాల నగేష్ కుమార్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి నాగేశ్వరరావు, న్యాయవాదులు కమలకుమార్, విశ్వ పాల్గొన్నారు.