
న్యాయవ్యవస్థను గౌరవించాలి
మహబూబాబాద్ రూరల్ : ప్రతీ ఒక్కరు న్యాయవ్యవస్థను గౌరవించాలని, కించపరిచే విధంగా వ్యవహరిస్తే చట్టపరంగా శిక్షార్హులవుతారని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేంచందర్ అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడికి నిరసనగా మహబూబాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. కోర్టు ప్రాంగణం ఎదుట న్యాయవాదుల నిరసన తెలిపిన అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేంచందర్ మాట్లాడుతూ.. దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించిన న్యాయవాదిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ ఆసోసియేషన్ సహాయ కార్యదర్శి ఉడుగుల హరికృష్ణ, కోశాధికారి దుదిమెట్ల మహేందర్, క్రీడల కార్యదర్శి కొర్ర మున్న, సభ్యులు కాసాని మౌనిక, సీనియర్ న్యాయవాదులు చలపతిరావు, వెంకటేశ్వర్లు, కేశవరావు, యాదగిరి, పద్మాకర్ రెడ్డి, జీవై.గిరి, సత్యనారాయణ, క్రిష్ణయ్య, ఉప్పలయ్య, తుంపిళ్ల శ్రీనివాస్, రహీమ్ పటేల్, ప్రభాకర్ రెడ్డి, మోహన్ నాయక్, శ్రీనివాసస్వామి, అమర్ నాథ్ గుప్త, కమల్ కుమార్, దర్శనం రామకృష్ణ, రాము తదితరులు పాల్గొన్నారు.
విధులు బహిష్కరించి న్యాయవాదుల నిరసన