గార్ల: మండలంలోని మర్రిగూడెం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం కనుల పండువగా జరిగింది. వేంకటేశ్వరస్వామి సమేత శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ప్రతిష్టించి మేళతాళాల మధ్య ఊరేగించి, ఎదుర్కోలు నిర్వహించారు. అనంతరం ఆలయం ఎదుట ఉన్న కల్యాణ మండపం వద్ద వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు. కాగా, డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామం నుంచి మల్లం వెంకటనారాయణ, మల్లం నరేందర్ తలంబ్రాలు తీసుకుకాగా.. పాలకుర్తి శ్రీనివాస్, కమటాల సత్యనారాయణ, పి.వెంకటనాగేశ్వరరావు, మట్టపెల్లి రణదీర్‌కుమార్ దంపతులు పీటలపై కూర్చోగా.. అర్చకులు రామాయణం అచ్చుతాచార్యులు, గోవింద్‌స్వామి, సందీప్‌స్వామి, కృష్ణచైతన్యచార్యులు, సుదర్శనస్వామి, రఘువెంకట రామస్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. జిల్లాతో పాటు ఖమ్మం, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కల్యాణ వేడుకను తలకించి భక్తిపారవశ్యం పొందారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, పరుచూరి కుటుంబరావు లడ్డూ ప్రసాదం పంపిణీ చేశారు. భూక్య కస్నానాయక్, పుల్లఖండం రమేష్‌బాబు, పి.కుటుంబరావు, మాజీ సర్పంచ్‌లు అజ్మీరా బన్సీలాల్, గంగావత్ లక్ష్మణ్‌నాయక్, ఆలయ ఈఓ సంజీవరెడ్డి, ఎం.రాములు, బి.హరినాయక్, కందునూరి ఉపేందర్, పి.వేణుగోపాల్‌రావు, పి.శ్రీనివాస్‌గుప్తా, వేమిశెట్టి శ్రీనివాస్, అత్తులూరి సత్యం, ఒబిలిశెట్టి కృష్ణ, కనకశేఖరం, బాదావత్ చంటి, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కనుల పండువగా వెంకన్న కల్యాణం