డీజీపీని కలిసిన ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

డీజీపీని కలిసిన ఎస్పీ

Oct 8 2025 6:45 AM | Updated on Oct 8 2025 2:44 PM

మహబూబాబాద్‌ రూరల్‌ : హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ శివధర్‌ రెడ్డిని సోమవారం రాత్రి మానుకోట ఎస్పీ సుధీర్‌రాంనాథ్‌ కేకన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీజీపీకి ఎస్పీ మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

కలెక్టరేట్‌లో వాల్మీకి జయంతి

మహబూబాబాద్‌: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ప్రధాన సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్‌ వత్సల్‌ టొప్పో, అనిల్‌కుమార్‌, బీసీ వెల్ఫేర్‌ జిల్లా అధికారి శ్రీనివాస్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఫర్టిలైజర్‌ షాపుల తనిఖీ

కేసముద్రం: మండలంలోని పలు ఫర్టిలైజర్‌ షాపులను డీఏఓ విజయనిర్మల మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు రికార్డులు, స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించారు. అదేవిధంగా జెడ్పీటీసీ ఆర్వో ఆఫీస్‌, ఎంపీడీఓ కార్యాలయం, పెనుగొండ గ్రామంలోని పోలింగ్‌ కేంద్రాలను ఆమె పరిశీలించారు. అంతకు ముందు 2025– వానాకాలం పంటల బుకింగ్‌, ‘కాపాస్‌ కిసాన్‌ యూప్‌’ ద్వారా పత్తి అమ్మకాల బుకింగ్‌పై రైతులకు అవగాహన కల్పించారు. ఆమె వెంట ఏఓ వెంకన్న ఉన్నారు.

హెచ్‌ఎంకు పాముకాటు

గంగారం: ప్రధానోపాధ్యాయురాలికి పాము కాటువేసిన సంఘటన మండలంలోని కోడిశెలమిట్ట ప్రాథమిక పాఠశాలలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ప్రధానోపాధ్యాయురాలు సరితను మధ్యాహ్నం పాఠశాల ఆవరణలో పాము కాటువేసింది. వెంటనే ఉపాధ్యాయులు, స్థానికులు గమనించి హెచ్‌ఎంను ఆస్పత్రికి తరలించి చికిత్సను అందించారు. ప్రస్తుతం ప్రధానోపాధ్యాయురాలి ఆరోగ్యం నిలకడగా ఉంది. కాగా, పాఠశాల ఆవరణలో పామును చంపేశారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఫ్రైట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిధులు మంజూరు

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలో వందేభారత్‌ రైలు మెగా మెయింటెనెన్స్‌ పీఓహెచ్‌, ఆర్‌ఓహెచ్‌ ఫ్రైట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వేశాఖ రూ.908కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రజలకు అవగాహన కల్పించాలి

నెహ్రూసెంటర్‌: కీటకజనిత వ్యాధుల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని యూపీహెచ్‌సీ వైద్యాధికారి మౌనిక, జిల్లా డిప్యూటీ మాస్‌మీడియా అధికారి కొప్పు ప్రసాద్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని అర్బన్‌ పీహెచ్‌సీలో మంగళవారం ఆశా డే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నివాస గృహాల మధ్య నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి స్థానిక మున్సిపల్‌ సిబ్బందితో పూడ్చివేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న సిబ్బంది సీ్త్ర, పురుషుల మధ్య వివక్ష ఉండకూడదని తెలియజేయాలన్నారు. పుట్టబో యేది ఆడ శిశువు అని తెలిసి గర్భస్రావానికి సిద్ధమవుతున్నారని, అలాంటి వారిని నిలువరించాలన్నారు. సమావేశంలో జిల్లా ఆశా నోడల్‌ ఆఫీసర్‌ సక్కుబాయి, హెచ్‌ఈ కేవీ రాజు, ఎంపీహెచ్‌ఈఓ తోట శ్రీనివాస్‌, సూపర్‌వైజర్‌ పుష్పలీల, ఆరోగ్య కార్యకర్తలు, ఆశకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

డీజీపీని కలిసిన ఎస్పీ1
1/1

డీజీపీని కలిసిన ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement