
ఎమ్మెల్యే ‘దొంతి’కి మాతృవియోగం
నర్సంపేట: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మాతృ వియోగం కలిగింది. చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌కు చెందిన దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మ(88) అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. రాత్రి 9 గంటల నుంచి ఎమ్మెల్యే నివాసంలో కాంతమ్మ పార్థివదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం హనుమకొండలోని పద్మాక్ష్మి గుట్ట పక్కన గల శివముక్తి ధామ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు హనుమకొండలోని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నివాసానికి చేరుకుని కాంతమ్మ పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.