
కారు ఢీకొని మహిళ మృతి
వర్ధన్నపేట : బస్సు కోసం వేచి చూస్తున్న మహిళను కారు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణం కోల్పోయింది. ఈ ఘటన శనివారం మండలంలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద జరిగింది. వర్ధన్నపే ట ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం.. మండలంలోని ఉప్పరపల్లికి చెందిన గ్రా మ పంచాయతీ స్వీపర్ జిల్లా హైమ (38) శనివారం ఉద యం ఉప్పరపల్లి క్రాస్ వద్ద వర్ధన్నపేటకు వెళ్లేందుకు రోడ్డు పక్కన నిలబడి ఉంది. ఈక్రమంలో వర్ధన్నపేట నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న కారు అదుపు తప్పి హైమను ఢీకొంది. ఈ ఘటనలో ఆమె ఎగిరి పడగా తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం అదే కారు ఉప్పరపల్లి వైపు వెళ్తున్న మరో కారును కూడా ఢీకొనడంతో ఆ కారు దెబ్బతింది. మృతురాలి కుమార్తె శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయిబాబు తెలిపారు. హైమ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
చెట్టుపై నుంచి పడి వ్యక్తి..
ములుగు రూరల్ : మండలంలోని దేవగిరిపట్నానికి చెందిన ఓ వ్యక్తి చెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. దేవగిరిపట్నం గ్రామం బోటిమీది తండాకు చెందిన భూక్య శ్రీనివాస్ (42) రోజువారీ కూలీతోపాటు మిషన్ కొనుగోలు చేసుకుని చెట్లు కోస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం గ్రామంలో పనికి వెళ్లి చెట్టుపై నుంచి రాయిపై పడ్డాడు. దీంతో తీవ్ర గాయం కావడంతో యజమాని గమనించి 108లో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య జమున, కుమార్తెలు పూజ, తేజ ఉన్నారు. శ్రీనివాస్ మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్ కుటుంబ సభ్యులను గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
కుంటలో పడి యువకుడు..
పెద్దవంగర: కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన ఓ యువకుడు కుంటలో పడి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచారం గ్రామ పరిధిలోని భద్రు తండాకు చెందిన బానోత్ మల్సూర్ (26)కు మతిస్థిమితం లేదు. పదేళ్ల క్రితం విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు. అప్పటి నుంచి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సమీపంలోని కుంటలోకి బహిర్భూమికి వెళ్లాడు. కాలకృత్యాలు తీర్చుకుని తిరిగి వస్తున్న క్రమంలో కుంటలో పడి మునిగిపోయాడు. శనివారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులకు నీటిలో మల్సూర్ మృతదేహం కనిపించింది. కాగా, ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

కారు ఢీకొని మహిళ మృతి

కారు ఢీకొని మహిళ మృతి