
కాపాస్ కిసాన్ యాప్‌పై శిక్షణ
హన్మకొండ: కాపాస్ కిసాన్ యాప్‌పై శనివారం ఉ మ్మడి వరంగల్ జిల్లాలోని వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులకు శిక్షణ ఇచ్చారు. వరంగల్ ప్రాంతీయ సంయుక్త మార్కెటింగ్ సంచాలకుడు వి.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ యాప్‌పై శిక్షణ ఇచ్చారు. రైతులు పత్తి అమ్ముకునేందుకు తప్పని సరిగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నా రు. అన్నదాతలు తమ స్మార్ట్ ఫోన్‌లో కాపాస్ కిసా న్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు రైతులకు యాప్‌పై అవగాహన కల్పించాలన్నారు. పత్తి కొనుగోలు సంబంధిత సేవలకు రైతులు టోల్ ఫ్రీ నంబర్ 18005995 779, వాట్సాప్ సేవలకు 8897281111 నంబర్‌ను సంప్రదించాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారులు, ఏడీఈలు, ఎంఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు.