
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
మామునూరు: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలిగితే మంచి భవిష్యత్ ఉంటుందని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, హనుమకొండ జూనియర్ సివిల్ జడ్జి చంద్రప్రసన్న అన్నారు. గాంధీ జయంతి వేడుకల సందర్భంగా వరంగల్ మామునూరులోని సెంట్రల్ జైల్ ప్రాంగణంలో ఇన్‌చార్జ్ జైల్ పర్యవేక్షణ అధికారి పరావస్తు వెంకటేశ్వర స్వామి, జైలర్ ఎం.పూర్ణచందర్ ఆధ్వర్యంలో ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జడ్జి హాజరై గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడాపోటీల్లో గెలుపొందిన ఖైదీలకు బహుమతులు ప్రదానం చేసి మాట్లాడారు. ఖైదీలు శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలతో బయటి సమాజంలో ఉపాధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో జైల్ అధికారులు సుధాకర్ రెడ్డి, మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.
జూనియర్ సివిల్ జడ్జి చంద్రప్రసన్న
సెంట్రల్ జైల్ ప్రాంగణంలో
గాంధీజయంతి