
మానేరులో వ్యక్తి గల్లంతు
టేకుమట్ల: మానేరు వాగు దాటుతూ వ్యక్తి గల్లంతైన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కలికోట శివారు మానేరులో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం చిట్యాల మండలం గిద్దెముత్తారం గ్రామానికి చెందిన అజ్మీరా రాజేందర్ (45) గురువారం ఉదయం బంధువుల ఇంటికి వెళ్తూ మానేరు దాటుతున్న క్రమంలో లోయలో పడి గల్లంతయ్యాడు. అతడితో పాటు వాగు దాటుతున్న పంచిక తిరుపతి, రాజేందర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు.
నల్ల బెల్లం, పటిక పట్టివేత
నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలంలోని రామన్నగూడెం శివారు బొడ్కతండా సమీపంలో అక్రమంగా నిల్వగా ఉంచిన 16.5 క్వింటాళ్ల నల్ల బెల్లం, 50 కిలోల పటికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బాదావత్ చోక్లా, గుగులోతు రాజేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాలోతు సురేష్ తెలిపారు.