
చినుకుపడితే చిత్తడి
● ఆర్‌అండ్‌బీ రోడ్డుపై గుంతల్లో నిలిచిన నీరు
● ఇబ్బందులు పడుతున్న
వాహనదారులు, ప్రజలు
వెంకటాపురం(కె): చినుకుపడితే మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ రహదారి చిత్తడిగా మారుతోంది. గుంతల్లో వరదనీరు నిల్వ ఉండి వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ఉన్న ఈ రోడ్డు గుంతలుగా మారింది. వర్షపు నీరు నిలిచి బురదమయంగా మారింది. కాగా, ఈ రోడ్డుపై వాహనదారులు వెళ్లేందుకు పాట్లు పడుతున్నారు. ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడుతూ రోడ్డు దాటి బస్టాండ్ వెళ్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆర్‌అండ్‌బీ రోడ్డుపై గుంతలు పూడ్చాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.