
వయ్యారిభామతో జాగ్రత్త
● వయ్యారిభామను పూత పూయకముందే వేర్లతో సహా పీకి బురదలో తొక్కేయాలి. లేదా పూతరాకముందే పీకి తగులబెట్టాలి.
● తంగేడు చెట్లు ఉన్నచోట ఇది మొదలవదు. పూతరాక ముందే పది నుంచి 15 లీటర్ల నీటికి 6 కిలోల ఉప్పు ద్రావణాన్ని కలిపి పిచికారీ చేయాలి. అలా చేస్తే కలుపు మొక్కలు మొలవవు.
బతుకమ్మలను తీసుకొస్తున్న మహిళలు
ములుగు జల్లా వాజేడు మండల పరిధిలోని గుమ్మడిదొడ్డి గ్రామంలో దసరా రోజున సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. గ్రామంలో రెండు వీధులు ఉన్నాయి. ఒకవీధిలో మాత్రం బతుకమ్మలను 13 రోజులు ఆడి
దసరా నాడు సద్దులు జరుపుకున్నారు.
అందులో భాగంగానే గురువారం రాత్రి సద్దుల బతుకమ్మ ఆడి శుక్రవారం ఉదయం బొగత వాగులో నిమజ్జనం చేశారు. అనంతరం
దసరా వేడుకలు జరుపుకున్నారు. – వాజేడు
బొగత వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేస్తున్న మహిళలు
మహబూబాబాద్ రూరల్: వయ్యారిభామ కలుపు మొక్కతో రైతులకు నష్టం వాటిల్లుతుందని మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బి.క్రాంతికుమార్ అన్నారు. వయ్యారిభామ అనేది అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క అని, అత్యంత సులభంగా వ్యాపించే ఈ మొక్క అతిత్వరగా, ఏపుగా పెరిగి పంట పొలాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. వయ్యారిభామతో పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుందని, అమెరికా నుంచి దిగుమతి అయిన ఆహార ధాన్యాలతో 1956లో మనదేశంలో చేరిందని తెలిపారు. ఆ తర్వాత మహారాష్ట్ర, బిహార్ నుంచి ఇతర రాష్ట్రాల్లో విపరీతంగా వ్యాపించిందని పేర్కొన్నారు. పంటలు, జంతువులు, మనుషులపైన తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, గోధుమ, వరి పంట పొలాలు, మామిడి, కూరగాయల తోటల్లో ఎక్కువగా వయ్యారిభామ పెరుగుతుందన్నారు. పంటలకు వేసిన ఎరువుల సారాన్ని పీల్చివేస్తుందని, 40 శాతం పంట దిగుబడిని తగ్గిస్తుందని సూచించారు నత్రజని, పోషక విలువలు, సూక్ష్మధాతువుల శాతాన్ని తగ్గిస్తుందని, వయ్యారి భామ పుష్పాల నుంచి వచ్చే పుప్పొడి రేణువులతో టమాట, వంకాయ, మిరప మొక్కలపైపడి పిందెలు, పూలు రాలిపోతాయన్నారు. చాలా వైరస్ తెగుళ్లు వీటి వలన వ్యాపిస్తాయని, వీటి విత్తనాలు గాలి ద్వారా సుమారు మూడు కిలోమీటర్ల మేరకు ప్రయాణిస్తాయని పేర్కొన్నారు. వయ్యారిభామ వల్ల మనుషులకు ఎగ్జిమా, హైఫివర్, ఉబ్బసం, బ్రాంకై టీస్ వ్యాధులు వస్తాయని తెలిపారు. ఆకులు చర్మానికి రాసుకుంటే తామర వస్తుందని, అలాగే జలుబు, కండ్లు, కనురెప్పలు వాపువస్తాయని, పశువులు, జంతువులకు వెంట్రుకలు ఊడిపోవడం, హైపర్ టెన్షన్ వస్తుందన్నారు. వయ్యారిభామను తిన్న పశువుల పాలుతాగితే వారికి జ్ఞాపకశక్తి తగ్గుతుందని, పశువుల జీర్ణక్రియ, కిడ్నీ, లివర్, అన్నవాహిక, శ్వాసక్రియ దెబ్బతింటుందని తెలిపారు.
వయ్యారిభామకు క్యారెట్ గడ్డి, ముక్క పుల్లాకు గడ్డి, నక్షత్ర గడ్డి పేర్లు కూడా ఉన్నాయి.
ప్రమాదకరమైన కలుపు మొక్క
పంటల్లో తగ్గనున్న దిగుబడి

వయ్యారిభామతో జాగ్రత్త

వయ్యారిభామతో జాగ్రత్త

వయ్యారిభామతో జాగ్రత్త

వయ్యారిభామతో జాగ్రత్త

వయ్యారిభామతో జాగ్రత్త

వయ్యారిభామతో జాగ్రత్త