
పూల మొక్కలు చెట్లుగా మారి..
● డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో
ప్రయాణికుల ఇబ్బందులు
డోర్నకల్: డోర్నకల్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారాలపై చాలా కాలం క్రితం నాటిన పూల మొక్కలు చెట్లుగా మారి విస్తరించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్‌లోని ఒకటి, రెండో నంబర్ ప్లాట్‌ఫారాలపై పూల మొక్కలు చెట్లుగా మారాయి. ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై నాటిన మొక్కలు చెట్లుగా మారి సిమెంట్ బెంచీలను ఆక్రమించాయి. తాగునీటి నల్లాలను కమ్మేశాయి. పూలమొక్కలతో పాటు ఇతర పిచ్చి మొక్కలు గుబురుగా పెరిగి దోమలు, దుర్వాసనతో పాటు పాముల భయంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రైల్వే అధికారులు స్పందించి ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించి సమస్య పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

పూల మొక్కలు చెట్లుగా మారి..

పూల మొక్కలు చెట్లుగా మారి..