
నిజ రూపంలో భ్రమరాంబిక
ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలోని భ్రమరాంబిక ఉపాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. భ్రమరాంబిక అమ్మవారు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి నవకలశ స్నపనం, సుగంధ పరిమళ ద్రవ్యములచే విశేష అభిషేకం, నవశక్త్యార్చన, ఆయుధపూజ (వాహనపూజ), కలశోద్వాసన త్రిశూల స్నానం, సామ్రాజ్య పట్టాభిషేకం, నీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా అమ్మవారిని గాజులతో ప్రత్యేక అలంకరించారు. గురువారం విజయ దశమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సాయంత్రం జమ్మి చెట్టుకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్‌శర్మ, వేదపండితులు గట్టు పురుషోత్తమశర్మ, విక్రాంత్ వినాయక్‌జోషి, అర్చకులు నందనం భానుప్రసాద్, మధు శర్మ, శ్రీనివాస్, నరేశ్‌శర్మ, దేవేందర్, సీనియర్ అసిస్టెంట్ అద్దంకి కిరణ్‌కుమార్, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఐనవోలులో ముగిసిన
శరన్నవరాత్రి ఉత్సవాలు
జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసిన ఆలయ అర్చకులు