మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో గురువారం మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్‌వత్సల్ టొప్పో, డీఆర్‌డీఓ మధుసూదన్ రాజు, ఉద్యాన శాఖ జిల్లా అధికారి మరియన్న, ఇన్‌చార్జ్ సీపీఓ అశోక్, డీపీఆర్వో రాజేంద్రప్రసాద్, కలెక్టరేట్ ఏఓ పవన్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రూ.2,50,002 ధర పలికిన దుర్గామాత పట్టుచీర
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణంలోని జై భవాని యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు అలంకరించిన పట్టుచీరను రూ.2,50,002 కు కాంగ్రెస్ నాయకుడు పద్మం ప్రవీణ్ కుమార్–ధనలక్ష్మి దంపతులు శుక్రవారం దక్కించుకున్నారు. దుర్గామాత భక్తులకు మహాలక్ష్మి అవతారంలో దర్శనం ఇచ్చిన సందర్భంలో అలంకరించిన పట్టుచీరను వారు కై వసం చేసుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవార్లకు అలంకరించిన చీరల్లో అధిక మొత్తంలో ధర పలకడం ఇదే ప్రథమమని ఉత్సవ కమిటీ బాధ్యులు తెలిపారు.
రామప్ప శిల్పకళాసంపద అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళాసంపద అద్భుతమని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన సతీమణి వరంగల్ మున్సిపల్ కమిషనర్ చహత్ బాజ్‌పాయ్‌తో కలిసి మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆలయ విశిష్టత గురించి వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని వారు కొనియాడారు, కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ ములుగు డీఈ నాగేశ్వర్‌రావు, విద్యుత్ అధికారులు వేణుగోపాల్, రమేష్, సాంబరాజు, సురేష్, కృష్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క
ములుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. ఇంచర్లలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం సమష్టిగా పనిచేయాలన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమిలేదని ఆరోపించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సామాజిక న్యాయం అందించాలనే తపనతో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీలుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. రైతులకు రెండు రూ.లక్షల రుణమాఫీ చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి, వ్యవసా య మార్కెట్ కమిటీ చైర్మన్ కల్యాణి ఉన్నారు.
కలెక్టరేట్‌లో గాంధీ జయంతి
కలెక్టరేట్‌లో గాంధీ జయంతి
కలెక్టరేట్‌లో గాంధీ జయంతి