
బ్రహ్మోత్సవాలకు వేళాయె..
రేపటి నుంచి మర్రిగూడెంలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
గార్ల: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గార్ల వేట వేంటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 5నుంచి 12వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. ఈమేరకు దేవాలయం ఈఓ గూడూరు సంజీవరెడ్డి శుక్రవారం వివరాలు వెల్లడించారు. గార్లకు 3 కిలోమీటర్ల దూరంలోని మర్రిగూడెం గ్రామం వద్ద వెలిసిన వేట వేంకటేశ్వరస్వామికి ఏటా ఆశ్వయుజ మాసంలో వారం రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కాగా బ్రహోత్సవాలకు ఆలయం ముస్తాబు కాగా.. అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ముస్తాబైన వెంకన్న ఆలయం
వారం పాటు జరగనున్న వేడుకలు