
దసరాకు సర్వం సిద్ధం
మహబూబాబాద్ అర్బన్/మహబూబాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా గురువారం విజయ దశమి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకోనున్నారు. ఈమేరకు అధి కారులు ఏర్పాట్లు చేశారు. పలు ఆలయాల్లో శమీ పూజ, జమ్మి ఆకు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని పాత బజారు హన్మంతునిగడ్డ శివాలయం స్థలంలో దసరా ఉత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. దసరా ఉత్సవాల్లో భాగంగా రావణాసుర వధ కార్యక్రమం కోసం పూర్తి స్థాయిలో లైటింగ్, అంబులెన్స్, అగ్నిమాపక యంత్రం, తాగునీరు ఏర్పాటు చేశామన్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టినట్లు చెప్పారు. ఈ సంబురాల్లో అధిక సంఖ్యలో మహిళలు, పిల్లలు పాల్గొనాలని, దసరా ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని విధాలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా బస్టాండ్ ప్రాంతం నుంచి, ముంకుంద థియేటర్, బైపాస్ నుంచి ప్రజలు దసరా వేడుకలకు హాజరై శాంతియుతంగా సంబురాలు నిర్వహించుకో వాలని కోరారు. ప్రజలు దసరా మహోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, విలీన గ్రామాల్లో కూడా దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
నేడు హన్మంతునిగడ్డలో
రావణాసుర వధ

దసరాకు సర్వం సిద్ధం

దసరాకు సర్వం సిద్ధం