
చెడును పారదోలేందుకు కృషి
● జిల్లా సాయుధ దళ కార్యాలయంలో ఆయుధ పూజ
మహబూబాబాద్ రూరల్ : సమాజంలోని చెడును పారదోలేందుకు పోలీసు విభాగం నిరంతరం కృషి చేస్తోందని ఏఆర్ డీఎస్పీలు శ్రీనివాస్, విజయప్రతాప్, మానుకోట డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. జిల్లా సాయుధ దళ కార్యాలయంలో బుధవారం ఆయుధ, వాహన పూజ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పోలీస్‌శాఖలో ప్రతీ సంవత్సరం దసరా పండుగ ముందు ఆయుధ పూజ నిర్వహించడం సంప్రదాయంగా వస్తుందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకోవడం జరుగుతుందని, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తరఫున పోలీసు అధి కార్లు, సిబ్బంది ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, రూరల్ సీఐ సరవయ్య, ఆర్‌ఐలు అ నిల్, సోములు, భాస్కర్, నాగేశ్వరరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
● ఎంపీ రఘువీర్‌రెడ్డి
దంతాలపల్లి: పార్లమెంట్‌లో తెలంగాణ వాటా నిధుల కోసం పోరాడి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. మండలంలోని దాట్ల గ్రామాన్ని బుధవారం సందర్శింంచి మొక్కలు నాటా రు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగా ణపై సవతిప్రేమ చూపుతుందని ఆరో పించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుండా వివక్ష చూపుతుందన్నారు. రాష్ట్రంలోని ఎంపీలందరూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చెడును పారదోలేందుకు కృషి