కోట్లు దోచిన ముఠా.. | - | Sakshi
Sakshi News home page

కోట్లు దోచిన ముఠా..

Oct 2 2025 8:01 AM | Updated on Oct 2 2025 8:01 AM

కోట్లు దోచిన ముఠా..

కోట్లు దోచిన ముఠా..

అధిక లాభం ఆశ చూపి ..

వరంగల్‌ క్రైం : పెట్టుబడికి అధిక మొత్తంలో లా భం ఇస్తామని ఆశ చూపిస్తూ ప్రజల నుంచి కోట్లా ది రూపాయలు దండుకున్న నలుగురు సభ్యుల గల ముఠాను టాస్క్‌ ఫోర్స్‌, పాలకుర్తి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్‌ చేసినట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. బుధవారం కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించి వారి నుంచి రూ.5.92 లక్షల నగదు, 684.5 గ్రాముల బంగారు నాణెలు,150 గ్రాముల బంగారు ఆభరణాలు, కారు, 4 సెల్‌ఫోన్లు, లాప్‌టాప్‌, రసీదు పుస్తకాలు, క్యాష్‌ కౌంటింగ్‌ మిషన్‌, చెక్‌ బుక్స్‌, స్టాంప్స్‌తో పాటు పొలాలు, ఇంటి స్థలాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.

నిందితులు వీరే..

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన తెప్పాలి సైదులు, పొడిల సురేశ్‌ కుమార్‌, పొడిల శ్రీధర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన మనుబోతుల రామకృష్ణ స్నేహితులు. ఈ ముఠాలోని ప్రధాన నిందితుడు తెప్పాలి సైదులు తన భార్య నారాయణమ్మ పేరు మీద 2023లో హెబ్సిబా పేరుతో అనధికారికంగా ఓ సంస్థను ఏర్పాటు చేసి చిట్టీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ చిట్టీలో చేరే వారు ముందు రూ. 6 వేలు చెల్లించాలి. ఇందులో 4 వేలు తన వద్దే డిపాజిట్‌ చేసుకుని మిగతా రూ. 2 వేలు సభ్యులకు ఈ సంస్థపై నమ్మకం కలిగేందుకు అంతే విలువైన వస్తువులను అందజేసేవాడు. కానీ వాస్తవంగా ఈ వస్తువుల విలువ కేవలం రూ. 3 వందలు మాత్రమే ఉంటుంది. ఈ సంస్థలో ఒక సభ్యుడు ఎన్ని సభ్యత్వాలైనా పొందొచ్చు. ఇందులో చేరిన ప్రతీ సభ్యుడికి నెలకు రూ. వెయ్యి చొప్పున 20 నెలలపాటు డబ్బును తిరిగి అందజేశాడు. ప్రధాన నిందితుడు మిగతా నిందితులతో కలిసి గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని సుమారు 28, 493 సభ్యత్వాలను నమోదు చేసుకోవడంతోపాటు వీరి నుంచి రూ. 4 వేల చొప్పున మొత్తం రూ.11.39 కోట్లు తన వద్దనే భద్రపరుచుకున్నాడు. సభ్యులకు కేవలం రూ. 3 వందల విలువైన వస్తువులను రూ. 2 వేలకు అమ్మడం ద్వారా మరో రూ. 4. 84 మిగిల్చుకున్నాడు. ఈ క్రమంలో ఈ సంస్థపై ఫిర్యాదులు రావడంతోపాటు ముఠా సభ్యులు ప్రజల సొమ్ముతో పరారయ్యే ప్రమాదాన్ని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ మోసం వెలుగు చూసింది. ముఠా సభ్యులు వసూలు చేసిన డబ్బును 17 బ్యాంకుల్లో జమ చేయగా రూ. 5.48 కోట్లకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగకుండా బ్యాంకు ఖాతాలను నిలిపివేసినట్లు సీపీ పేర్కొన్నారు. కాగా, ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన వెస్ట్‌ జోన్‌ డీసీపీ రాజమహేంద్రనాయక్‌, వర్ధన్నపేట, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీలు నర్సయ్య, మధుసూదన్‌, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పవన్‌, పాలకుర్తి సీఐ జానకీరాం రెడ్డి, పాలకుర్తి, టాస్క్‌ఫోర్స్‌ ఎస్సైలు వంశీ కృష్ణ, దిలీప్‌, సిబ్బందిని సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ అభినందించారు.

ఈ ఘటనలో నలుగురి అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement