
ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికెట్ల నమోదు ప్రక్రియ ప్రారంభం
కాజీపేట: కాజీపేటలోని రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో బుధవారం ఆన్‌లైన్‌లో పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ నమోదు కార్యక్రమాన్ని ఎస్‌బీఐ మేనేజర్ రఘునాథ్ ప్రారంభించారు. అక్టోబర్ 30వ తేదీ వరకు పెన్షనర్లు జీవించి ఉన్నట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని, లేనిపక్షంలో పింఛన్ ఆగిపోతుందన్నారు. పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కె.సంగమయ్య, మారపాక కట్టస్వామి, సాధినేని సూర్య నారయణ, నవ్య తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ వర్సిటీ కబడీ టోర్నమెంట్‌కు కేయూ జట్టు
కేయూ క్యాంపస్ : కర్నాటక రాష్ట్రం బెల్గావిలోని రాణి చెన్నమ్మ యూనివర్సిటీలో అక్టోబర్ 4నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై. వెంకయ్య బుధవారం తెలిపారు. జి. నాగరాజు, ఆర్. సోమేశ్వర్, జి. రమేశ్, జి. గోపి, వి. కృష్ణకుమార్. పి. ప్రణయ్, బి. సుమన్, కె. బన్నీ, సి.హెచ్. శివాజీ, బి. రేవంత్, యు. శ్రావణ్, బి. ఆజాద్, బి. కౌశిక్, సి.హెచ్. రాము జట్టులో ఉన్నారు. కోచ్‌గా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కుమారస్వామి, మేనేజర్‌గా హనుమకొండ వాగ్దేవి డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ వ్యవహరిస్తారని వెంకయ్య తెలిపారు.

ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికెట్ల నమోదు ప్రక్రియ ప్రారంభం