
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
స్టేషన్‌ఘన్‌పూర్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి మృతి చెందాడు. ఈ ఘటన స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధి ఛాగల్లులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఛాగల్లుకు చెందిన కత్తెరశాల రమేశ్(44) స్టేషన్‌ఘన్‌పూర్ శివారు కొత్తపల్లి క్రాస్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్‌బంక్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజూ మాదిరిగానే మంగళవారం రాత్రి పని ముగించుకుని స్వగ్రామం వెళ్లాడు. ఛాగల్లులో కాలి నడకన జాతీయ రహదారి దాటుతుండగా హైదరాబాద్ నుంచి హనుమకొండ వైపునకు వె ళ్తున్న కారు ఢీకొనడంతో రమేశ్‌కు తీవ్ర గా యాలయ్యాయి. స్థాని కులు గమనించి క్షతగాత్రుడిని చికిత్స నిమి త్తం వరంగల్ ఎంజీఎం తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య రాజశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు.