
కనుల పండువగా దాండియా, జాగరణ
మహబూబాబాద్ రూరల్: జగన్మాత దుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ పట్టణంలోని మహేశ్వరీ భవన్‌లో మంగళవారం రాత్రి దాండియా నృత్యాలు, జాగరణ పూజా కార్యక్రమాలు కనుల పండువగా జరిగాయి. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్–డాక్టర్ ఉమా దంపతులు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు, మాజీ ఎమ్మెల్యే మార్వాడీలతో కలిసి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో మార్వాడీ సమాజ్, మార్వాడీ యువ మంచ్, సఖీ మండలి సభ్యులు పాల్గొన్నారు.

కనుల పండువగా దాండియా, జాగరణ